సాధారణంగా జామతోటలు నాటిన రెండేళ్లకు కాపుకు వస్తాయి. కాని 'అర్క కిరణ్' రకం నాటిన 11 నెలలకే కాపుకొస్తుంది. పంటకు పెట్టిన పెట్టుబడి మొత్తం మొదటి ఏడాదే చేతికొచ్చింది. రెండో ఏటనుంచి ప్రతి ఆరు మాసా లకోసారి కాపుకు వస్తోంది. ఈ రకం జామకాయ బరువు 180-200 గ్రాములు ఉంటుంది. దిగుబడి కూడా బాగానే ఉంటుంది. కాబట్టి అర్క కిరణ్ జామ సాగుతో రైతులు భారీ లాభాలు పొందవచ్చు.