చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం బోయకొండ గంగమ్మ ను కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ ప్రమీల నాయుడు గురువారందర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ నారాయణ, ఈ ఓ చంద్రమౌళి, మాజీ పాలకమండలి సభ్యుడు రాయలమోహన్ సాదర స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు. ఆలయం వద్ద అభివృద్ధి చూసి ఆమె సిబ్బందికి అభినందనలు తెలిపారు.