రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా గురువారం ఉదయం 10. 30 గంటలకు సీపీఐ రాష్ట్ర కార్య దర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర ప్రతినిధి బృందం తిరుపతి సిపిఐ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రేణిగుంట కరకంబాడి వద్ద ఉన్న గాలేరు నగరి సృజల స్రవంతి ప్రాజెక్ట్ శిలాఫలకం పరిశీలిస్తారు. పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలు ర్యాలీగా వెళ్తారని సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.