పశ్చిమగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి పెనుగొండ పంచాయతీ పరిధిలోని రాజు గూడెం ప్రాంతంలో 129 వ రోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనవలసిందిగా తూర్పు పాలెంలోని శాసనసభ్యులు క్యాంపు కార్యాలయ సిబ్బంది కోరారు.