టిడిపితోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సర్పంచ్ ల సంఘ జిల్లా అధ్యక్షులు, టిడిపి యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అభిమాన సంఘ నాయకులు, అభిమానులు యువ నాయకులు గొండు శంకర్ ఆధ్వర్యంలో గురువారం టిడిపిలో చేరారు. నగరంలోని విశాఖ ఏ కాలనీ లోని గొండు శంకర్ కార్యాలయంలో వారికి టిడిపి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా టిడిపి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. టిడిపితోనే తమకు భవిష్యత్తు ఉంటుందని యువత నమ్ముతున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మి రాజ్యం, మాజీ కౌన్సిలర్ పాoడ్రంకి శంకర్, టిఎస్ఎన్ఎఫ్ నియోజకవర్గం ప్రెసిడెంట్ దొండపాటి నవీన్, టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రెడ్డి శంకర్, జిల్లా కళ్యాణ రామ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎన్ టి ఆర్ టౌన్ అధ్యక్షులు బుర్రి మధు, రెల్లి వీధి శంకర్, రాము, రవి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.