ఏడాదికి రెండు పంటలు పండించే పంట భూములు వ్యవసయేతర భూములు గా నేడు మారుతున్నాయి. రియల్టర్లు తమ మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ అక్రమ లేఅవుట్లు వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఎందుకు పనికిరాని భూమికి ప్రస్తుతం విపరీతమైన గిరాకీ పెరిగింది. అమాంతంగా భూములు రెక్కలు వచ్చాయి డివిజన్ కేంద్రం ఆమదాలవలస తో పాటు బూర్జ మండలాలలోని వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వేసారు. రెవెన్యూ పంచాయతీ అధికారుల చేతివాటం తో లేఅవుట్లలో ఎక్కడ నిబంధనలు పాటించలేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనలు బేఖాతరు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే 2005 నాలా భూ మార్పిడి చట్టప్రకారం రెవెన్యూ శాఖ అనుమతులు తప్పని సరిగా పొందాలి చట్టం ప్రకారం భూమి విలువ లో 5 శాతం రెవెన్యూ శాఖకు చెల్లించాలని గతంలో నిబంధన ఉంది. ప్రస్తుతం దీన్ని సడలిస్తూ రెండు శాతానికి పరిమితం చేసింది. కొందరు రియల్ వ్యాపారులు రెవెన్యూ శాఖకు ఎలాంటి నగదు చెల్లించకుండా వ్యవసాయ భూములను వ్యవసాయితర భూములుగా మారుస్తున్నారు. అన్న ఆరోపణలు వినిపిస్తున్న యి
అనుమతులు లేకుండా లేఅవుట్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్ వేసేందుకు గ్రామపంచాయతీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. నిబంధనల ప్రకారం లేఅవుట్లు వేసేటప్పుడు 30 అడుగుల రోడ్లు, మంచినీటి వసతి, విద్యుత్తు సౌకర్యంతో, పాటు కమ్యూనిటీ హాల్, కు ప్రత్యేకంగా కేటాయించాలి. ఇలాంటి నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేసి రియల్ వ్యాపారం దర్జాగా చేసుకుంటున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల వ్యవసాయ భూమి లో మట్టి తొలిచి వ్యవసాయేతర భూమిగా మార్చేశారు. ఇప్పటికీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ప్రజలను మాయ చేసి ప్లాట్లు విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పాలకొండ నుండి శ్రీకాకుళం ప్రజా నా రహదారికి ఇరువైపులా ఉన్న డొంకల పర్త లక్కుపూరం, తుడ్డలి, పాలవలస , గ్టపెద్దపీట మదనాపురం అప్పలపేట కేకే రాజపూరం సుంకరాడ కొల్లి వలస లచ్చయ్యపేట సింగన్నపాలెం ఉప్పెనవలస కోరగాం గ్రామాల్లోను అలాగే సరుబుజ్జిలి మండలానికి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా గోపిదేవి పేట తిమ్మడం, అన్నం పేట, పి ఎల్ ఎన్ దేవి పేట, ఆమదాలవలస, కొమ్మువలస , నరేంద్రపురం తదితర ప్రాంతాలలో ఇప్పటికే లేఅవుట్లు వేశారు. అక్రమంగా వేసిన లే అవుట్ లో కి వెళ్లేందుకు పంట కాల్వలను పూడ్చి తూములు వేస్తున్నారు పంట కాలువలపై వంతెనలు వేయాలంటే తప్పనిసరిగా సంబంధిత శాఖ అనుమతులు తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రియల్ వ్యాపారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించకపోవడంతో ప్రభుత్వ ఆదాయభ్రలకు గండి పడుతుంది పూర్తిస్థాయిలో వసతులు కల్పించకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసే వారు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది అధికారులు సమన్వయంతో పనిచేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. రియల్ ఎస్టేట్ లు వ్యాపారం చేసే వారు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటా లేఅవుట్లు వేసేవారు తప్పనిసరిగా ప్రభుత్వ శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని బూర్జ తాసిల్దార్ఎస్వీ రమణారావు తెలిపారు.