సాలూరు నియోజకవర్గం రామభద్రపురం సబ్ ఇన్స్పెక్టర్ బి. సురేంద్రనాయుడును అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరినాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గౌరి నాయుడు సబ్ ఇన్స్పెక్టర్ సురేంద్రనాయుడుతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏఐహెచ్ఆర్ఏ జిల్లా ప్రతినిధి కొత్తలి గౌరినాయుడు మాట్లాడుతూ ఎస్సై సురేంద్ర నాయుడు తన స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు తమ పరిధిలో గల సమస్యలను తెలియజేసేందుకు స్టేషన్కు వచ్చిన నేపథ్యంలో ఆయన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా అలాగే స్నేహపూర్వకంగా మెలగడం ఆనందదాయకమని ఆయన అన్నారు. ఏ సమయంలోనైనా ఎవరైనా తమ సమస్యను తెలియజేసేందుకు ఫోన్లో సంప్రదిస్తే తక్షణమే స్పందిచడం తమ విధి నిర్వహణకు నిదర్శనమని గౌరి నాయుడు అన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, అనునిత్యం ప్రజా సమస్యలపై స్పందించడం హర్షనీయమని ఆయన అన్నారు. ఇలాంటి సబ్ ఇన్స్పెక్టర్ లు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.