నర్సీపట్నం మున్సిపాలిటీ అవినీతికి నిలయంగా మారిందని మూడు నెలలుగా పారిశుద్యం కుంటుపడిందని జనసేన పార్టీ కన్వీనర్ రాజాన వీర సూర్య చంద్ర ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఎక్కడా పారిశుద్య పనులు చేపట్టడం లేదన్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ పారిశుద్యం మెరుగుపర్చడంలో లేదని ఎద్దేవా చేశారు. దీనివల్ల ప్రజలు పలు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు.