కడప అభివృద్ధి పై సవాళ్లు ప్రతి సవాళ్లు నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులను పోలీసలు ముందస్తుగా అరెస్టులు చేశారు. కడప ఏడు రోడ్ల కూడలికి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి హరి ప్రసాద్ ను గృహ నిర్బంధం చేశారు. అక్కడికి వచ్చిన వైసీపీ నాయకులను పోలీసులు పోలీసు స్టేషన్ కు తరలించారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఒంటిమిట్టకు తరలించారు.