పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలిపే ఘటన ఇటీవల చోటు చేసుకొంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి సమర్పించిన చీరకు క్రేజ్ పెరిగింది. ఈ చీర ఎవరికి దక్కుతుందనే చర్చ జరిగింది.. అయితే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి ఈ శారీని కొనుగోలు చేశారు. చీర ఖరీదు ఎంత అయితే ఉందో అంత ధరకే కొన్నారు.. అమ్మవారిని తాకిన ఈ చీరను పవన్ కళ్యాణ్‌కు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చీర సెంటిమెంట్ పరంగా.. తప్పకుండా విజయం వరిస్తుందని తన నమ్మకమని.. అందుకే ఈ చీరను ఆయనకు బహుమానంగా పంపిస్తానని స్వరూప దేవి తెలిపారు.
పవన్ కళ్యాణ్ జనవరి 25న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మ వారికి 8 వేల రూపాయల విలువైన చీరను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ దుర్గమ్మకు సమర్పించిన చీరకు ఆలయ అధికారులు నంబర్ కేటాయించారు. ఫిబ్రవరి 6న దుర్గమ్మకు అలంకరించారు. పవన్‌కళ్యాణ్‌కు వారిచ్చిన రశీదు వైరలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చీరకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.. ఎంత ధరైనా పర్లేదని తమకు ఇవ్వాలంటూ చాలామంది అడిగారు. దీంతో చీర కోసం డిమాండ్ పెరిగింది.. కొంతమంది చీర కోసం కాంట్రాక్టర్‌పై ఒత్తడి కూడా తీసుకొచ్చారు.
ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆ చీరను తిరిగి పవన్ కళ్యాణ్‌కు పంపించాలని కాంట్రాక్టర్ నిర్ణయం తీసుకున్నారట. ఆ వెంటనే జనసేన నాయకులను పంపించి ఆ చీర ఖరీదు ఎంత అయితే అంత రుసుము చెల్లించి చీరను తీసుకున్నారు. దీంతో జనసేన పార్టీ మహిళా నేత గంటా స్వరూప దేవి చీరను కొనుగోలు చేశారు. త్వరలోనే పవన్ కళ్యాణ్‌కు ఈ చీరను పంపిస్తామని స్వరూప అంటున్నారు.