రైతులకి కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏటా రూ.6,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అలానే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌ను కూడా రైతుల కోసం కేంద్రం తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకి కేవలం 4 % వార్షిక వడ్డీకి వ్యవసాయ రుణాలు వస్తాయి. రూ.3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఈ పథకం ద్వారా రైతులు మరణించినా, శాశ్వత వైకల్యానికి గురైనా రూ.50,000 వరకు బీమా కవరేజీ కూడా వస్తుంది.