కేంద్ర ప్రభుత్వం పలు పురుగులమందుల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ జాబితాలో కార్బోఫ్యురాన్, మలాథియాన్, మోనోక్రోటోపాస్, క్వినాల్ ఫాస్, మాంకోజెబ్, ఆక్సీఫోరోఫిన్, డైమిథేట్, క్లోరిఫైరిపాస్ ఉన్నాయి. పంటలపై వీటి అవశేషాల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. అభ్యంతరాలుంటే 30రోజుల్లోపు jsppdac.gov.inకు మెయిల్ పంపాలని తెలిపింది.