చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ఓ ఎంపీ పీఏ హెడ్ నర్సుతో అసభ్యకరం ప్రవర్తించాడు. రెండ్రోజుల కింద ఓ ఎంపీ పీఏ ఆస్పత్రికి ఫోన్ చేసి తమ బంధువులు ప్రసూతి సేవల కోసం వస్తున్నారని చెప్పారు. దీంతో అధికారులు ఏర్పాటు చేశారు. కాగా, బుధవారం రాత్రి ఓ హెడ్ నర్సు వార్డులో ఉండగా, పీఏ ఆమె చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భయంతో పరుగులు తీసి సహచర నర్సులతో చెప్పడంతో వారు డీసీహెచ్ ఎస్ కు ఫిర్యాదు చేశారు.