ప్రకాశం జిల్లా, ముండ్లమూరు మండలంలోని జమ్మలమడక పంచాయతీ పరిధిలోని మక్కెనవారిపాలేనికి చెందిన వివాహిత నిమితం శివకుమారి(19) బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఈ మేరకు ముండ్లమూరు పోలీసులకు మృతురాలి తండ్రి ఐనాబత్తుని శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎల్ సంపత్‌కుమార్ చెప్పారు. వివరాల్లోకి వెళితే... గుంటూరుకు చెందిన శివకుమారిని రెండేళ్ల క్రితం మక్కెనవారిపాలేనికి చెందిన సాయికి ఇచ్చి వివాహం చేశారు. పిల్లలు పుట్టలేదు. ఈ కారణంగా మనస్తాపం చెందడంతోపాటు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తోడవ్వటంతో గురువారం రాత్రి పురుగుల మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు మొదట అద్దంకి, ఆ తర్వాత ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందింది. శివకుమారి మృతికి ఆటో ఫైనాన్స్ వారు వచ్చి భర్త ఇంట్లో లేని సమయంలో గొడవ పడటంతో మనస్తాపం చెంది మృతి చెందిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. శివకుమారి మృతదేహానికి తహసీల్దార్ ఎస్ ఉషారాణి సమక్షంలో శవపంచనామా నిర్వహించారు.