వైఎస్ వివేకా హత్యతో సీఎం జగన్ క్రూరత్వం బయటపడిందని, అందుకు సంబంధించి అన్ని ఆధారాలతో టీడీపీ విడుదల చేసిన జగనాసుర రక్త చరిత్ర పుస్తకంలో ఉన్నాయని ప్రకాశం జిల్లా, పామూరు టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బొల్లా మాల్యాద్రిచౌదరి చెప్పారు. మండలంలోని కోడిగుంపల గ్రామంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పునుగుబాటి మాల్యాద్రి ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఇదేంఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ప్రభాకర్‌చౌదరి, ఎం హుస్సేన్‌రావు, అమీర్‌బాబు, వైఎస్ ప్రసాద్‌రెడ్డి, ఖాజారహంతుల్లా, ఎం. రమణయ్య, జి. శ్రీనివాసులు, డి. మాల్యాద్రి, కోటిరెడ్డి, ఎం. రామకృష్ణ మహేష్, గ్రామకమిటీ కార్యదర్శి మోడి మహేంద్ర, కొప్పల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.