భారత్ లో ఇంధన డిమాండ్ గణనీయంగా పెరిగింది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో 13.6 శాతం పెరిగింది. చలి పరిస్థితులు వాహనాల రాకపోకలను తగ్గించడంతో జనవరిలో నెలవారీగా అమ్మకాలు 5.1 శాతం పడిపోయాయి. ఫిబ్రవరి 1-15 మధ్య కాలంలో డీజిల్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 25 శాతం పెరిగి 3.33 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 2021 మొదటి అర్ధభాగంలో వినియోగం 16.7 శాతం పెరిగింది. 2020 కంటే ఇది 7శాతం ఎక్కువ. ఫిబ్రవరి మొదటి అర్ధభాగంలో పెట్రోల్ అమ్మకాలు దాదాపు 18 శాతం పెరిగి 1.22 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.