అనంతపురం ఆర్డిటీ వేదికగా కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి విద్యాశాఖ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్డీటి సంస్థ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో ప్రతాపరెడ్డి విందు ఏర్పాటు చేశారు. ఇక ఈ విందులో హెడ్ మాస్టర్లు, అధికారుల వద్దకు వెళ్లి పలకరింపుల వరకూ ఓకే కానీ.. కౌగిలింతలు, కరచాలానాలు, సెల్ఫీలతో ప్రతాప్ రెడ్డి హంగామా చేశారు. సమావేశం వేదికపైకి సంఘాల నేతలకు ఆహ్వానం పలికారు. మొత్తంగా విద్యాశాఖ సమావేశాన్ని వైసీపీ ఎన్నికల ప్రచారంగా మార్చారు. విందు సమాచారం తెలుసుకుని ఆర్డీటి కార్యాలయం వద్దకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు వెళ్లారు. వైసీపీ మద్దతు అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి గెలుపు కోసమే అంటూ విమర్శలు ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేసి విందు సమావేశం ఏర్పాటు చేయడమేంటంటూ ప్రతాప్ రెడ్డిని విద్యార్థి సంఘాల నేతలు నిలదీశారు.