నెల్లూరు, విజయమహల్‌గేటు రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో గురువారం రాత్రి ఓ యువకుడు నెల్లూరు వైపు వస్తున్న యశ్వంత్‌పూర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకోపైలెట్ ఫిర్యాదు మేరకు నెల్లూరు రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద డ్రైవింగ్ లైసెన్సు, బైక్ ఆర్సీ, ఓటర్ ఐడీకార్డు, ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా మృతుడు కర్నాటక రాష్ట్రం బెంగళూరు నగరం జీవన్హల్లి మారుతీ సెబానగర్కు చెందిన పి శశికుమార్ (31)గా భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకు తరలించారు. ప్రమాదంలో సెల్‌ఫోను దెబ్బతినడంతో అందులోని సిమ్‌లను సేకరించి వాటి ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. లోకోపైలెట్ హారన్ కొడుతున్నా యువకుడు నేరుగా రైలుకింద పడ్డారని పోలీసులకు తెలిపారు. దీంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.