అనంతపురం జిల్లా, రొద్దం మండలంలోని పెద్దకోడిపల్లికి చెందిన బోయ మూలింటి శంకరప్ప(44) కుటుంబ కలహాలతో గురువారం ఇంట్లో ఉరేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే..... సాయంత్రం భార్య సరోజమ్మను మూలింటి శంకర ప్ప కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఆతర్వాత తలుపులు వేసుకుని పంచెతో ఇంటి పైకప్పునకు ఉరేసుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో భార్య సరోజమ్మ పొరుగింటివారికి సమాచారం ఇచ్చిం ది. వారు వచ్చి తలుపులు పగలకొట్టి చూడగా, శంకరప్ప ఉరికి వేలాడుతున్నాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు. మృతునికి భార్య, కుమారు డు, కుమార్తె ఉన్నారు. ఎస్ఐ నాగస్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు.