ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంలో కేజ్రీవాల్ పార్టీ ఆప్‌కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మేయర్ ఎన్నిక విషయంలో నామినేటెడ్ సభ్యుల సాయంతో మేయర్ పదవిని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆప్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఓటు వేయకూడదని తీర్పు ఇచ్చారు.ఢిల్లీ మేయర్ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది.