తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో పోలీసులు అడ్డుకోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రగా అనపర్తికి చేరుకున్నారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని అనపర్తి చేరుకున్నారు. అనపర్తిలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపైనా, పోలీసులపైనా విరుచుకుపడ్డారు.తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, ఆయన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరన్నారు. ప్రజల కోసం ఎన్నో అవమానాలు భరించాను.. నా పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చిన పత్రాలు ఇవి.. పోలీసులు నా దగ్గర పనిచేసిన వ్యక్తులు. జగ్గంపేటకు వెళ్తే పోలీసులు సహకరించారు, పెద్దాపురం వెళ్తే పోలీసులు సహకరించారు... కానీ అనపర్తి వెళ్లాలనుకుంటే అడ్డుకున్నారు.