నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త అందించింది. 11,409 పోస్టుల (ఎంటీఎస్-10,880, హవల్దార్-529) దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ఫీజును 26 వరకు చెల్లించవచ్చు మార్చి 2 మరియు 3 తేదీల్లో దరఖాస్తుల్లో మార్పులు చేయవచ్చు. పదో లేదా తత్సమాన అర్హత. కంప్యూటర్ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. హవల్దార్ అభ్యర్థులకు అదనంగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. వివరాల కోసం ssc.nic.in ని సందర్శించండి.