అరటిపండు తీపి మరియు రుచిగా ఉంటుంది కాబట్టి చాలా మంది దీనిని తినడానికి ఆసక్తి చూపుతారు. కానీ అరటిపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గుండెపోటు, గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. వీటిని తినడం వల్ల రక్తహీనత తగ్గి రక్తపోటు అదుపులో ఉంటుంది.