టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా, ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఎన్నికల కోడ్ నిబంధనలు తెలియవా అని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తే ఎలా అని ప్రశ్నించారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఎన్నికల కోడ్ రూల్స్ తెలియవా అని ఎద్దేవా చేశారు.
ప్రజలను రెచ్చగొట్టేందుకు, రాష్ట్ర విధ్వంసానికే చంద్రబాబు యాత్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణాలో ఉంటూ రాష్ట్రం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, లోకేష్ సైకోళ్లా ప్రవర్తిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. పోలీస్ రక్షణ లేకుండా చంద్రబాబు బయటకు వచ్చే దమ్మూ, ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. పోలీసులు, వ్యవస్ధలపైన, ముఖ్యమంత్రిపైన చంద్రబాబు పిచ్చోడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.