అనపర్తిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా జాతీయ టిడిపి, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆదేశాల మేరకు శనివారం కొల్లూరు మండలంలో బస్ స్టాండ్ సెంటర్ నుండి అంబెడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ర్యాలీ టిడిపి మండల అధ్యక్షులు మైనేని మురళి కృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ ఎస్ సి సెల్ కార్యనిర్వాహ కార్యదర్శి బూర్రి జగన్, వేమూరు నియోజకవర్గ ఐటిడిపి అధికార ప్రతినిధి యడ్ల శ్రీనివాస్ , కొత్తపల్లి మధు, తుమ్మల బాప్పయ్య, సుంకర శ్రీను, వేములపల్లి మోహన్ కృష్ణ , మల్లంపాటి హరి ప్రసాద్, సింహాద్రి సుబ్బారావు, నూకల వెంకటేశ్వరరావు, నాగల్ల కృష్ణారావు , మున్నంగి విజయ్, ఆలపాటి జేమ్స్, కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.