భారత్ తో జరగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు పీటర్ హ్యాండ్ కాంబ్ సంచలన క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ తో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఔట్ అయ్యాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ 25 ఓవర్ లో నాథన్ లియోన్ వేసిన లో రెండో బంతిని అయ్యర్ లెగ్ సైడ్ ఫ్లిక్ చేశాడు. ఫస్ట్ షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హ్యాండ్ కాంబ్ డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ ను అందుకున్నాడు. ఇది చూసిన అయ్యర్ షాక్ కు గురయ్యాడు.