శరీరానికి శక్తి అందించేందుకు ఆహారం అవసరం. మనం తీసుకునే ఆహారం కడుపు నింపడమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలు అందించేలా ఉండాలి. అయితే, కేరళలోని కాసర్ గడ్ కు చెందిన బాలకృష్ణన్ అనే వ్యక్తి మాత్రం 24 ఏళ్లుగా కేవలం కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. తనకున్న గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు డైట్ గా కొబ్బరినే ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టాడు. షహనాజ్ అనే టూరిస్ట్ ఈ విషయాన్ని నెట్టింట పంచుకోగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.