ఉత్తరప్రదేశ్లోని నాసిర్పూర్ ప్రాంతంలో రెండు వర్గాల యువకులు బెల్టులు, కర్రలతో తుక్కుతుక్కుగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫిరోజాబాద్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇరు వర్గాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన నాసిర్పూర్ ప్రాంతంలోని రుధౌ గ్రామంలో జరిగింది.