దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ప్రముఖ కేదార్ నాథ్ ధామ్ ఆలయం తలుపులు తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఉత్తరాఖండ్ ఛార్ ధామ్ లోని ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఏప్రిల్ 25న భక్తులకు అందుబాటులోకి వస్తుందని ఛైర్మన్ అజేంద్ర అజయ్ వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా కమిటీ ఈ కీలక ప్రకటన చేసింది. ఆ రోజు మతపరమైన ఆచారాల అనంతరం ఉదయం ఆలయం తెరుచుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa