వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ సూచించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం రాత్రి నగరంలోని ఎస్సీ-2 ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు ఆరా తీయగా.. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సరిగా ఉండటం లేదని, అయినా తినాలని ఒత్తిడి తెస్తున్నారని, తినకపోతే ఆ రోజు ఆబ్‌సెంట్ వేస్తున్నారని కొందరు విద్యార్థులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించాలని పక్కనే ఉన్న ఆర్డీఓకు జడ్జి సూచించారు. పెచ్చులూడిన గదిని పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీనివాస్, ఏఎ్‌సడబ్ల్యూఓలు పాల్గొన్నారు.