క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు (69) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈయన 1954లో కాళ్ల మండలం జక్కరం గ్రామంలో జిన్మించారు. 2004లో ఉండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2021లో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. సర్రాజు మృతి పట్ల సీఎం జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ఆదర్శ నగర్లోని సర్రాజు నివాసానికి సీఎం జగన్ చేరుకుని ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, మంత్రులు దాడిశెట్టి రాజా, కారుమూరి వెంకట నాగేశ్వరరావు తదితరులు సర్రాజు పార్థివదేహానికి నివాళులర్పించారు.