గుడివాడ గుట్కా నాని, పిల్ల సైకో వల్లభనేని వంశీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు, లోకేశ్ డీఎన్ఏ... డెవల్‌పమెంట్ ఆఫ్ నవ్యాంధ్ర అయితే సైకో సీఎం డీఎన్ఏ డిస్ట్రక్షన్ ఆఫ్ నవ్యాంధ్ర. జగన్‌ది చంచల్‌గూడ జైల్ డీఎన్ఏ అయితే, లోకేశ్‌ది స్టాన్ఫోర్డ్ డీఎన్ఏ. సైకో సీఎం డీఎన్ఏ కాలకేయులది అయితే మా నేతలది రాళ్లసీమను రతనాల సీమగా మార్చిన కృష్ణదేవరాయల డీఎన్ఏ. అవినీతితో సృష్టించిన షెల్ కంపెనీల్లో భాగస్వామిని చేసి, భారతిని రోడ్డుమీదకు లాగింది సైకో సీఎం అని తెలుసుకోరా గుడివాడ గుట్కాగా’’ అంటూ పట్టాభి తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. పిల్ల సైకో వంశీపై పోటీకి లోకేశ్ దాకా ఎందుకు? మా నేతలు ఆదేశిస్తే నేను రెడీ అని సవాల్ విసిరారు.