టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పోలీసులు వాడిన అసభ్యకర భాష చూస్తుంటే అనాగరికులు కూడా తలదించుకునేలా ఉందని వర్ల రామయ్య అన్నారు. నాగరికులు ఎవరూ అలాంటి భాష మాట్లాడరని అన్నారు. ఫిబ్రవరి 17న కోనసీమ జిల్లా, అనపర్తి, రామచంద్రాపురం పోలీసులు ఇలాంటి మరో ఘటనకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉన్న జవహర్‌ను పోలీసులు అరెస్టు చేసి నేలపై కూర్చోబెట్టారని, స్టేషన్‌కు వచ్చిన ఇతర సందర్శకులను కుర్చీలపై కూర్చోబెట్టి జవహర్‌ను మాత్రం నేలపై కూర్చోబెట్టి హింసించారని మండిపడ్డారు.