టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు భద్రతపై ఎస్ఎస్జీ అప్రమత్తమైంది. అనపర్తిలో చంద్రబాబుపై పోలీసుల తీరును తప్పుపట్టింది. జడ్ ఫ్లస్ భద్రత ఉన్న చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తమ కేంద్ర కార్యాలయానికి లేఖ రాసింది. ఏడు కి.మీ. దూరం నడిపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులకు నోటీసులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోందని సమాచారం.