వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్.. బాల శివుడికి పాలు పట్టిస్తున్న పోస్టర్ను వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వెంటనే తొలగించాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీ ట్విట్టర్లో హేళన చేస్తున్నట్లుగా చిత్రాన్ని ప్రదర్శించడంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఈ రోజు 12 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు సోమువీర్రాజు తెలిపారు. వైసీపీ పార్టీ హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానించిందని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.