అనపర్తి నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన చంద్రబాబు పర్యటనలో పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేస్తామని అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్య టన విజయవంతానికి కృషిచేసిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు చట్ట వ్యతిరేకంగా చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. సభకు అనుమతులు ఇచ్చి గంటల వ్యవధిలో రద్దు చేయడం చంద్రబాబుకు వస్తున్న ఆదరణను అడ్డుకోవాలని ప్రయత్నించడమేనని అన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు కల్పించినా ప్రజల చైతన్యాన్ని ఆపలేక పోయా రన్నారు.