తెలుగు భాష వ్యాప్తికి ప్రభుత్వంతో పాటు తెలుగుభాషాభిమానులు కృషి చేయాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు కోరారు. తొలి తెలుగు దివ్వె సహకారంతో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు, సంస్కృత అకాడమీ-ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 21న భవానీ ద్వీపంలో నిర్వహించే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల కరపత్రాల ఆవిష్కరణ శనివారం బందరు లాకుల సెంటర్‌లోని సాతంత్ర ్య సమరయోధుల భవన్‌లో జరిగింది. తొలి తెలుగు శాసనకర్త ముత్తురాజు ధనంజయుడు చిత్రపటానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పించారు. తొలి తెలుగు దివ్వె అధ్యక్షురాలు పిల్లి లక్ష్మీతులసీ, అధికార భాషా సం ఘం సభ్యుడు ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి, పబ్లిషర్ గాజుల సత్యనారాయణ, తొలి తెలుగు దివ్వె వ్యవస్థాపకుడు పీవీఎల్‌ఎన్ రాజు పాల్గొన్నారు.