పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తెనపల్లి చెక్ పోస్ట్ దగ్గర లారీ ఢీకోని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరోకరి గాయాలయ్యాయి. మృతుడిని పోలీసులు దొంగగా గుర్తించారు. రాత్రి పేరేచర్ల సమీపంలో మోటార్ సైకిల్‌ను చోరీ చేశాడని పోలీసులు తెలిపారు. మృతుడు నుంచి మరో రెండు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయాలైన మరో దొంగ పరారు అయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.