సింగరాయకొండ, మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్‌ను ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శనివారం సందర్శించారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తనే ప్రత్యేకంగా ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్‌ను ఏర్పాటు చేయించానని చెప్పారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను పలు పత్రికల్లో ప్రచురితమైన కథనాలు ద్వారా తన దృష్టికి వచ్చినట్లు ఆయన చెప్పారు. వెంటనే సమస్యను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి, కలెక్టర్ దినే్‌షకుమార్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. తాత్కాలికంగా బీ సీ బాలికల కళాశాల హాస్టల్‌కు మార్చాలని కోరానని విద్యార్థినులకు చెప్పారు. ఎస్సీ బాలికల కళాశాల విద్యార్థినులకు ప్రత్యేకంగా హాస్టల్‌ను కేటాయించాలని ఎమ్మెల్యే స్వామిని విద్యార్థులు కోరారు. అందుకు తనవంతు కృషిచేస్తానని ఆయన హామీచ్చారు. ఆయన వెంట టీడీపీ నేతలు చీమకుర్తి కృష్ణ, మించల బ్రహ్మయ్య, సుదర్శి ప్రసాద్, గుదే వెంకటేశ్వర్లు ఉన్నారు.