శివసేన పార్టీతో పాటు గుర్తుపై సుప్రీంకోర్టులో కొట్లాడేందుకు ఉద్ధవ్ థాక్రే సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ఆయన సవాల్ చేయనున్నారు. ఇందుకోసం న్యాయ నిపుణులతో శనివారం చర్చలు జరిపారు. ఇవాళ కూడా తన వర్గానికి చెందిన సీనియర్ నాయకులతోనూ సమీక్షించారు. మరోవైపు, పార్టీ పేరు, గుర్తుల కేటాయింపులో పెద్ద మొత్తంలో బేరం కుదిరిందన్న ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణలపై షిండే వర్గం సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.