ఛత్రపతి శివాజీ జయంతిని మరాఠా సంఘం నాయకులు ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. సంఘం నాయకుడు సత్యనారాయణ ఆధ్యర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్చించారు. హిందువులు సంఘటితంగా మెలగాలని మరాఠా సంఘం అధ్యక్షుడు శంకర్‌బాబు, కార్యదర్శి లాయర్ హరికృష్ణ సూచించారు. విశ్రాంత ఏడీఈ రాజేంద్రప్రసాద్, గౌరవ సభ్యులు కృష్ణమోహన్, జయసింహారావు, రామకృష్ణ, భవానీశంకర్, సుధాకర్, వంశీ, సాయివిశాల్ పాల్గొన్నారు.