ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరువు భత్యంను వెంటనే ప్రకటించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2023, 03:30 PM

ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం కరువు బత్యం ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల కోరారు. ఆదివారం ప్రొద్దుటూరు స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు మూడు డీఏలను ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డీఏను కూడా ప్రకటించలేదన్నారు. 2018 నుండి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సిన డీఏలను ఇంతవరకు చెల్లించలేదని తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి , ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట ఆడిట్ కమిటి సభ్యుడు క్రిష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రామదస్తగిరి రెడ్డి , రాష్ట కౌన్సిలర్లు గోపినాధరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గురయ్య, ఖాదర్ భాష, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com