రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలంలోని జి. రెడ్డి గారి పల్లిలో సర్పంచ్ ఆకుల శ్రీనివాసులు స్వగృహము లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి విచ్చేసి ఎన్నికల చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు. అనంతరం మండల కేంద్రమైన సుండుపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో 22వ తేదీన జరగబోయే నామినేషన్ ప్రక్రియ విషయమై ఎమ్మెల్సీ ఎన్నికలపై సుండుపల్లి మండల వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి వైసీపీ అభ్యర్థి గెలుపుకై కార్యచరణ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 22వ తేదీ నామినేషన్ రోజున నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని ముఖ్య నాయకులతో అన్నారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల వైసీపీ మండల అధ్యక్షులు, జెడ్పిటిసి, వైసీపీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు వైయస్సార్సీపి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.