స్పందనలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు అధికారులు పంచుకుని వారంలో స్పందన ఫిర్యాదులను పరిష్కరించాలని చిట్వేలి మండల రెవెన్యూ అధికారి మురళీకృష్ణ అన్నారు. సోమవారం చిట్వేలి మండల రెవెన్యూ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల వారీగా గ్రామ రెవెన్యూ అధికారులు స్పందనలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తగిన విధంగా న్యాయం చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషం రాజు, మండల సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.