ఉత్తరప్రదేశ్లో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి రోడ్డుపై ఇద్దరు యువతులు,, కారులోని యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో ఓ యువకుడు యువతిపైకి దూసుకెళ్లాడు. ఆమెను తాకుతూ, తిడుతూ రచ్చ చేశాడు. దీంతో అమ్మాయి కూడా ఏమాత్రం తగ్గకుండా అతన్ని కొడుతూ మీదకి వెళ్లింది. ఈక్రమంలో ఇరువర్గాలు దూషించుకున్నారు. ఈ ఘటనని అక్కడే ఉన్న వ్యక్తి రికార్డు చేసి సోషల్మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది.