ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులు ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ పొందొచ్చు. 18నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సున్న రైతులు దీనిలో చేరచ్చు. దీనిలో 18 ఏళ్ల వారు రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వారు రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వారు రూ.200 ప్రీమియం చెల్లించాలి. ఇలా 60 ఏళ్ల దాకా కట్టాలి. 60 ఏళ్ల తర్వాత ప్రతినెలా 3వేలు చొప్పున పెన్షన్ వస్తుంది. రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 50% ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది.