జైలులో ఉండే ఖైదీలకు ఫోన్ అనుమతి ఉండదనే విషయం తెలిసిందే. అయితే అధికారులు తెలియకుండా ఫోన్ ఉంచుకున్న ఓ ఖైదీ, తనిఖీలకు భయపడి ఫోన్ మింగిన ఘటన బీహార్ లోని గోపాల్ గంజ్ జైలులో జరిగింది. 'శనివారం తనిఖీలు చేపడుతుండగా కైషర్ అలీ అనే ఖైదీ ఫోన్ మింగేశాడు. నిన్న అతడు కడుపునొప్పితో బాధపడుతుండడంతో ఎక్స్- రే తీయగా విషయం బయటపడింది' అని సూపరింటెండెంట్ తెలిపారు.