అదానీ గ్రూపు షేర్లపై హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల దెబ్బకు దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ నికర సంపద ఆవిరి అయిపోతుంది. నెల రోజుల క్రితం 120 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద, ఇప్పుడు 50 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. నేడు అదానీ సంపద 49.1 బిలియన్ డాలర్ల(రూ.4 లక్షల కోట్లు)కు చేరిందని బ్లూమ్ బర్గ్ సంస్థ వెల్లడించింది.