మహారాష్ట్ర లోని శివసేన పార్టీ పేరు, గుర్తు వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. సీఎం ఏక్ నాథ్ శిండే వర్గానికి విల్లు, బాణం గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ ఫిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అయితే, థాక్రే విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు, రేపు విచారణ చేపడతామని తెలిపింది.