ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో 17 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. బాలికను నిందితుడు నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వీడియో వైరల్‌గా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని పట్టుకుని గొలుసులతో బంధించి అదే వీధిలో ఊరేగిస్తూ తీసుకెళ్లారు. శనివారం బాలికపై దాడి జరగ్గా ఆదివారం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.